2, మార్చి 2009, సోమవారం

ఒక ముగింపు

చిన్నప్పుడు

నాన్న మొక్కను నాటుతుంటే

నేను పెరిగి పెద్దయ్యే సరికి

పండ్లు కాస్తుంది, తినొచ్చనుకొని

సంధ్యావందనం పూర్తయ్యాక

మిగిలిన నీళ్ళతో దీని మూలాన్ని తడిపాను


కానీ -

ఉద్యోగం శూన్యమై

కులవృత్తి శాపమై

ఉరి తీసుకోడానికి

ఈ చెట్టే సాధన మౌతుందని

ఊహించ లేక పోయాను!

(ఆంధ్రప్రభ దినపత్రిక, 15.05.1996)

2 కామెంట్‌లు:

కొత్త పాళీ 2 మార్చి, 2009 9:32 PMకి  

సారీ సార్.
మీ పద్యంలో ఉన్న నిరాశావాదం అతకలేదు.

అజ్ఞాత,  2 మార్చి, 2009 10:18 PMకి  

anthagaa athakaledu..

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP