మౌనప్రవాహం
రంపం పొట్టులా
క్షణాలు రాలిపోయే వేళ...
నేను
నిశ్శబ్దంగా విస్తరించుకుంటాను
జ్ఞాపకాలు కెరటాలై
ఒడ్డును ఢీకొన్నప్పుడల్లా
హృదయం చెదిరిపోతూనే ఉంటుంది
రెప్పల మధ్య
ఆశల్ని దాచాలనే ప్రయత్నం
ఎప్పుడూ
నీటి మీద గీసిన గీతే!
అవునూ...?
ఆకురాలిన చెట్టును అసహ్యించుకుంటూ
పక్షులు వలస వెళ్ళిపోతున్నాయేంటి?
ఎండిపోతున్న చెరువుకు భయపడి
చేపలు బిత్తరపోతున్నాయేంటి ?
వసంతమూ -
వర్షమూ -
ఎటు తప్పిపోయాయి !
ఇక్కడ స్వప్నలన్నీ
ఏ మౌన ప్రవాహంలో పడి
కొట్టుకుపోయాయి...?!
1 కామెంట్‌లు:
మీరు 1998-2000 మధ్యలో శ్రీ ఆదర్శ జూనియర్ కాలేజ్,ఒంగోలు లో పనిచేసారా?
I have heard of this poetic collection "పొగమంచు" during that time... Can you please mail me on KBPerim@GMail.Com if that is the case...
కామెంట్‌ను పోస్ట్ చేయండి