అహందళిత
ఎప్పటికైనా సరే
వాస్తవం ఉప్పెనై పొంగక మానదు
అడ్డు కట్టలు శిరసు వంచకా తప్పదు!
పట్టుగుడ్డలు కట్టినా
రాతి బొమ్మలు ద్రవించవు నాయనా!
ఉద్యమమంటే ద్రవించడమనీ
నాకు బాగా తెలుసు
నీ గాయంలోకి నేను ద్రవిస్తున్నాను
నేరాల్ని కడుక్కోడానికి
ఆత్మ విమర్శ కూడా చేసుకోలేని
అమానవీయ మలిన దేహాల మధ్య
మడిగుడ్డనై
ఇన్నాళ్ళు మనిషులకెంత దూరమయ్యానూ..!
నేను పవిత్రుణ్నవ్వాలి.
పరివర్తనా న్వేషణలో
చీకటి చివరి తపోవనంలోకి
అదృష్టంగా అడుగులు పెడుతున్నాను
చతుర్వేదాల పరిధి దాటి
ఇప్పుడు పంచమ వేదమే వల్లించాలి.
ఈ మహోజ్వలిత హోమ గుండంలో
మనం సమిధలం కానే కాదు.
ఋత్విక్కులమూ, ఫల స్వీకర్తలమూ మనమే.
1 కామెంట్‌లు:
రాతి బొమ్మలు ద్రవించవు నాయనా!
ఉద్యమమంటే ద్రవించడమనీ
నాకు బాగా తెలుసు
నీ గాయంలోకి నేను ద్రవిస్తున్నాను
ఎంత అద్భుతమైన కవిత్వమండీ.
ఉద్యమం అంటే జీవితమే.
నిజమే రాతిబొమ్మలు ద్రవించవు, ఎందుకు శుష్క యత్నాలు. మనలోకే ద్రవించే ఈశ్వరుడుండగా!
కవిత్వం జలజల రాలే కవిత్వం అంటే ఇదే.
ధన్యవాదములు
భవదీయుడు
బొల్లోజు బాబా
కామెంట్‌ను పోస్ట్ చేయండి