9, ఫిబ్రవరి 2009, సోమవారం

మెరుపులు


ఆకాశం కంచంలో
దేవతల రాత్రి భోజనం ముగిసింది
మిగిలిన మెతుకులు మెరుస్తున్నాయి
***

పొట్ట నిండిందేమో
మేఘాలు తేన్పుతున్నాయి
ఉరుములు

***

కదిలితే ఐకమత్యం
ఆగితే పెడముఖాలు
ఫాను రెక్కలు
***

ఆకాశంలో నీటికరువు
అర్ధరాత్రి చంద్రుడు
మా తోట్లో జలకమాడుతున్నాడు
***

పగలు ఫిడేలు రాగాలు
రాత్రుల్లో తీగ తెగిన వీణ
గిలకబావి
***

నిద్రపోవు
చెట్టును నిద్రపోనివ్వవు
ఎండుటాకులు
***

సముద్రం మీద
చెత్తను ఊడ్చే చీపుర్లు
కెరటాలు
***

నింగికి స్వాతంత్ర్యదినం
వరుణుడు ఎగరేసిన జండా
ఇంద్రధనస్సు
(16.04.1999 04:55)

3 కామెంట్‌లు:

మధురవాణి 10 ఫిబ్రవరి, 2009 5:17 AMకి  

అన్నీ బావున్నాయి.
కానీ.. ఫ్యాన్, చంద్రుడి జలకాలాట నాకు బాగా నచ్చాయి.
nice post :)

నేస్తం 10 ఫిబ్రవరి, 2009 7:00 AMకి  

సరిగ్గా ఇలాంటి వాటికోసమే ఎదురు చూస్తున్నాను చాలా చాలా బాగున్నాయి

  © Blogger templates The Professional Template by Ourblogtemplates.com 2008

Back to TOP