చిగురు కల
గాయపడ్డా ముఖంతో
గొడుగులా విచ్చుకోవడం బతుకయ్యాక
స్వప్నం కూడా రుధిర చారికవుతుంది
ఎవరూ స్వప్నాలకి తలుపు తీయక్కర్లేదు
పొరలు పొరలుగా జారుతూ
స్వప్నంలోంచి మరో స్వప్నంలోకి...
స్వప్నం జ్ఞాపకం కాదు
జ్ఞాపకాలు స్వప్నాలూ కావు
రాతి పొత్తిళ్ళలో గాయపడి
ఊపిరిలేని స్థితివైపు తిరోగమించిన
అసంపూర్తి చిత్రాలే స్వప్నాలు
బతుకు వొక చిగురుకల
ముగింపు మొదళ్ళలోంచి
మనిషి మళ్ళీ స్వప్నంగా మొలకెత్తుతాడు
(01.03.2001, సాయంసంధ్యా సమయం)
1 కామెంట్‌లు:
చాలా చాలా బాగుందండి..
"స్వప్నం జ్ఞాపకం కాదు
జ్ఞాపకాలు స్వప్నాలూ కావు
రాతి పొత్తిళ్ళలో గాయపడి
ఊపిరిలేని స్థితివైపు తిరోగమించిన
అసంపూర్తి చిత్రాలే స్వప్నాలు"
కామెంట్‌ను పోస్ట్ చేయండి