ముసుగు నీడ
రక్తమో, రాగమో
నిశ్శబ్దం అంచుపై ప్రవహిస్తూ
కాలాన్ని భయపెడుతోంది
రాజకీయమో, అరాచకీయమో
దారి తప్పని నిజాయితీని
చీకటి గదిలో ఉరి తీస్తోంది
భయమో, భక్తో
మటలనెక్కుపెట్టే పెదాలపై కూర్చొని
మౌనాన్ని వడుకుతోంది
వెలిగే దీపం చుట్టూ
ముసుగు నీడలు గుమిగూడి
చావు డప్పుమోగిస్తున్నాయి
మనిషి మృగమైన చోట
మతాబులు కాలవు
శవాలు తప్ప!
(ఆంధ్రజ్యోతి వార పత్రిక, దీపావళి సంచిక, 28.10.1996)
1 కామెంట్‌లు:
నేను దళితుడనే అన్న కవిత మీదే కదూ. చదివి చాన్నాళ్ళయింది ఎప్పుడు పోస్ట్ చేస్తారు?
కామెంట్‌ను పోస్ట్ చేయండి